ప్రజలకు హాని కలిగించే బల్క్ డ్రగ్ పార్కును కాకినాడ ప్రజలు వ్యతిరేఖించడంతో రాజయ్యపేటకు తీసుకువచ్చారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు అన్నారు. గురువారం ఆయన రాజయ్యపేటలో మత్స్యకారులతో మాట్లాడారు. బల్క్ డ్రగ్ పార్క్ ను ఈ ప్రాంతంలో మత్స్యకారులు అందరూ వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు.