నక్కపల్లి మండలం రాజయ్యపేట పంచాయతీ తీర్మానం లేకుండా బల్క్ డ్రగ్ పార్క్ ఎలా ఏర్పాటు చేస్తారని అనంతగిరి జెడ్పీటీసీ దీసరి గంగరాజు, నక్కపల్లి జెడ్పీటీసీ గోసల కాసులమ్మ ప్రశ్నించారు. శనివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడుతూ హెట్రో ఏర్పాటు చేయక ముందు సముద్రంలో మూడు కిమీలోపు మధ్య సంపద లభ్యమయ్యేదన్నారు. ప్రస్తుత 20 కిలోమీటర్లు వెళ్లినా చేపలు దొరకక మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటుందన్నారు.