నిరుధ్యోగ యువతకు అండగా నిలబడి వారి పక్షాన పోరాడేందుకు జనసేన పార్టీ నడుం బిగించింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు నిరుధ్యొగ యువతతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నున్న ఎంప్లాయ్మెంట్ కార్యాలయాల వద్దకు వెళ్ళి అక్కడి అధికారులకు నిరుధ్యొగ సమస్యలను వివరించి.. తక్షణమే ప్రభుత్వ ఉధ్యోగ ఖాళీలను భర్తీ చేసే విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రాలు సమర్పించనున్నారు.
ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీ మంగళవారం జనసేన పార్టీ ఆద్వర్యంలో విశాఖపట్నంలోని కంచెరపాలెం వద్దనున్న ప్రభుత్వ ఉపాధి కార్యాలయం (ఎంప్లాయ్మెంట్ ఆపీస్) వద్ద నిరుధ్యోగ యువతతో కలిసి జనసైనికులు అధికారులకు వినతి పత్రాలు సమర్పించనున్నారు.
ఈ విషయమై జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ మాట్లాడుతూ జనసేనఋ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నిరుధ్యోగ యువతకు అండగా విశాఖలో నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లాలోని నిరుధ్యోగ యువతి , యువకులతోపాటు జనసైనికులను శివదత్ కోరుచున్నారు.