వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించనున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ పై విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం విస్తృత స్థాయి చర్చ జరిగింది. జిల్లాలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరై సలహాలు, సూచనలు అందజేశారు. రానున్న ఐదేళ్లలో విశాఖ రూపురేఖలు మారేలా వినూత్న ప్రజక్టులు రానున్నాయన్నారు.