విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణే ధ్యేయం

63చూసినవారు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలు సోమవారం నాటికి 1,333వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సిఐటియు జగదాంబ జోన్ సుబ్బారావు అధ్యక్షతన నిరసనలో పలువురు కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్ నాయకుడు రాజు మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశభక్తి పేరు చెప్పి దేశ సంపదను కారు చౌక ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్