వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ గురువారం భేటీ అయ్యారు. విజయవాడ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని కలిసి రాజకీయపరమైన అంశాలపై కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ప్రజల గురించే నిత్యం పరితపించే జగనన్న మళ్లీ నూతన ఉత్సాహంతో కనిపించారన్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్లో మంచి రోజులు వస్తాయని జోష్యం చెప్పారు.