విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ కాకి గోవింద రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సచివాలయ ఉద్యో గులు గురువారం సాయంత్రం గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. సచివాలయ ఉద్యోగులకు ఏం పనిలేదని, ఖాళీగా ఉంటున్నారని ఆయన అనడంపై ఉద్యోగులు మండిపడ్డారు. కార్పొరేటర్ వెంటనే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ చేశారు. రోజంతా తమతో కలిసి విధి నిర్వహణలో పాల్గొంటే తాము ఏం చేస్తున్నామో తెలుస్తుందని అన్నారు.