ఉమ్మడి విశాఖ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లిన జిల్లా వాసులు పండగ కోసం తరలి వచ్చారు. మూడు రోజులు ఎంతో ఎంజాయ్ చేశారు. నిన్న రాత్రి నుంచే పలువురు తిరిగి తమ ఉద్యోగాలకు బయల్దేరారు. దీంతో గురువారం జిల్లాలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. మరికొందరు సొంత వాహనాలతో తిరుగుపయనం అవుతున్నారు.