విచ్చలవిడిగా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలను తగ్గించాలని సిపిఎం మధురవాడ జోన్ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం ధరాభారంపై మధురవాడ మార్కెట్ కూడలి వద్ద నిరసన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మధురవాడ జోన్ కమిటీ కార్యదర్శి డి.అప్పలరాజు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగాయన్నారు.