విశాఖ: 26న కార్మిక ప్రదర్శన సభ జయప్రదం చేయండి
నవంబర్ 26న అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై రైల్వే డి.ఎం.ఆర్ ఆఫీస్ నుండి గాంధీ విగ్రహం వరకు కార్మిక మహా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్.వి.కుమార్ శనివారం మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలని చూస్తున్నారని ఆరోపించారు.