యలమంచిలి పట్టణం ధర్మవరం కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపు నిర్వహించి ఆలయంలో అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొఠారు సాంబశివరావు, సభ్యులు కొండబాబు, కొఠారు నరేష్ తదితరులు పాల్గొన్నారు.