అసైన్డ్ భూములు ఫ్రీ హోల్డ్ కాక ముందే జరుగుతున్న ఇన్సైడ్ ట్రేడింగ్ నుండి ఎస్సిల భూములకు రక్షణ కల్పించాలని విదసం ఐక్య వేదిక జాతీయ ఎస్సి కమీషన్ సభ్యులు వి రామ చందర్ కు విజ్ఞప్తి చేసింది. విశాఖ పర్యటనలో ఉన్న రామ చందర్ ను విదసం ఐక్య వేదిక ప్రతినిధులు శుక్రవారం పోర్టు గెస్ట్ హౌస్ లో కలసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.