రాంబిల్లి: వరద బాధితులకు రూ. 2.50 లక్షల విరాళం

67చూసినవారు
రాంబిల్లి: వరద బాధితులకు రూ. 2.50 లక్షల విరాళం
విజయవాడ వరద బాధితుల సహాయార్థం రాంబిల్లి మండలం గురజాపాలెంలో గల స్టెరాక్స్ లైఫ్ సైన్సెస్ కంపెనీ యాజమాన్యం రూ. 2. 50 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు చెక్కును అనకాపల్లి కలెక్టరేట్లో కలెక్టర్ విజయ కృష్ణన్ కు బుధవారం కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ రాంప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కంపెనీ యాజమాన్యాన్ని అభినందించారు.

సంబంధిత పోస్ట్