AP: పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా సీప్లేన్ సేవలను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్, వైజాగ్ సముద్ర తీరాల్లో నీటి విమానాశ్రయాల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సీఎం చంద్రబాబు విమానాశ్రయ అభివృద్ధి సంస్థ(APADC)కు సూచించారు. దీంతో అధ్యయనానికి ఆసక్తి కలిగిన సంస్థల నుంచి APADC రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌ను ఆహ్వానించింది. ఏప్రిల్ 3వ తేదీలోపు ప్రతిపాదనలను పంపాలని కోరింది.