రేషన్ కార్డుల ఈ– కేవైసీ గడువు పెంపు

83చూసినవారు
రేషన్ కార్డుల ఈ– కేవైసీ గడువు పెంపు
రాష్ట్రంలో నివసించే వాళ్ల రేషన్ కార్డుల ఈ–కేవైసీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. మార్చి 31తో గడువు ముగియనుండగా.. దానిని మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ లోపు ప్రజలు ఈకేవైసీ చేసుకోవాలని పౌరుసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. మరోసారి పెంపుదల ఉండదని చెప్పారు. ఏప్రిల్ 30లోపు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. లేకపోతే రేషన్ నిలిపివేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్