ఫ్లైట్‌లో ప్రయాణికుడు మరణించడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇండిగో విమానం శనివారం పట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే ఫ్లైట్ గాల్లో ఉండగా విమానంలో ప్రయాణిస్తున్న అస్సాంకు చెందిన సతీష్ మరణించారు. దీంతో విమానాన్ని లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కుటుంబసభ్యులతో కలిసి ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.