AP: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పింఛను ఇచ్చే విషయమై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం చేనేత, దివ్యాంగులు, ఆదివాసీ గిరిజనులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. మరణించిన వారి పేర్లు మాత్రమే పింఛన్ జాబితా నుంచి తొలగిస్తున్నామని మంత్రి తెలిపారు.