తిరుమలలో ఈనెల 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మార్చి 30న ఉగాదిని పురస్కరించుకొని తిరుమలలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే ఉగాదికి ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఆగమోక్తంగా జరిపిస్తారు. దీంతో మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది.