AP: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కలిశెట్టిగూడెంలో మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు పర్యటించారు. అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం వచ్చాక ధాన్యం కొనుగోళ్లలో సంస్కరణలు తెచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో ఐదు లక్షల టన్నుల ధాన్యం కొంటున్నట్లు ప్రకటించారు.