ఇంగ్లండ్ మహిళా స్పిన్ ఆల్‌రౌండర్ చార్లీ డీన్ వన్డేల్లో హ్యాట్రిక్ సాధించింది. డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఆమె ఈ ఘనత సాధించింది. 25 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ తరపున మహిళల వన్డేల్లో తొలిసారి హ్యాట్రిక్ సాధించిన ప్లేయర్‌గా డీన్ నిలిచింది. ఓవరాల్‌గా ఇంగ్లండ్ వన్డే చరిత్రలో ఇది మూడో హ్యాట్రిక్. అంతకు ముందు కరోల్ హోడ్జెస్(1993) క్లేర్ కానర్(1999)లు మాత్రమే ఇంగ్లండ్ తరపున వన్డేల్లో హ్యాట్రిక్ తీశారు.