నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే నీళ్లు వదులుతాం: చంద్రబాబు

57చూసినవారు
నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే నీళ్లు వదులుతాం: చంద్రబాబు
AP: పోలవరం పర్యటనలో బాగంగా సీఎం చంద్రబాబు ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. అనంతరం పోలవరం నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతూ.. పోలవరం కోసం భూమిని పోగొట్టుకున్న నిర్వాసితులకు రూ.4,311కోట్లు చెల్లించామన్నారు. 2027నాటికి నిర్వాసితులకు పునరావాసం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదులుతామని సీఎం చంద్రబాబు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్