హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు, భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రోడ్ల విస్తరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అదనపు భూసేకరణకు ఖర్చు ఎక్కువైనా వెనుకాడవద్దని స్పష్టం చేశారు.