షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. తీపి, కారం, ఉప్పు, పులుపు, వగరు, చేదుల కలయిక.. జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న విషయాన్ని బోధపరుస్తుంది. ఉగాది పచ్చడిలోని బెల్లం ఆనందానికి, పచ్చిమిరప కష్టానికి, వేపపువ్వు విషాదానికి, మామిడి మాధుర్యానికి, చింతపండు ఆరోగ్యానికి, ఉప్పు భయానికి ప్రతీకలు. ఉగాది పచ్చడి దివ్య ఔషధమనే చెప్పాలి. ఇది వేసవి తాపాన్ని తగ్గించడమే గాక, వాతావరణ మార్పు వల్ల వచ్చే రోగాలను సైతం దూరం చేస్తుంది.