దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు

82చూసినవారు
దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు
దానిమ్మ సాగులో బ్యాక్టీరియా మచ్చ తెగులు రైతులకు పెద్ద సమస్యగా మారుతోంది. ఈ తెగులు పంట దిగుబడిని, కాపుకొచ్చిన కాయల నాణ్యతనూ తగ్గిస్తోంది. తెగులును కలగజేసే బ్యాక్టీరియా ఆకులు, రెమ్మలు, కాయలపైన మచ్చలు కలగజేస్తుంది. దీనికి గురైన మొక్క ఆకులు రాలిపోవడం, కొమ్మలు విరిగిపోవడం జరుగుతుంది. కాయలపై ముదురు గోధుమరంగు నుంచి నలుపురంగు గరుకు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్యభాగంలో కాయలపై పగుళ్లు ఏర్పడి పనికిరాకుండా పోతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్