తోటలో తెగులు ఆశించిన కొమ్మలను, కాయలను కత్తిరించి నాశనం చేయాలి లేదా కాల్చివేయాలి. కత్తిరింపులకు వాడిన పరికరాలను సోడియం హైపోక్లోరైట్ ద్రావణంలో (లీటరు నీటికి 10 గ్రా) అరగంట ఉంచి శుద్ధి చేయాలి. తోటలో చెట్ల పొదల్లో ఎకరాకు 8 నుంచి 10 కిలోల బ్లీచింగ్ పౌడరును చల్లుకోవాలి. దీనివల్ల పాదుల్లోని తెగులు సోకిన ఆకులు, రెమ్మలలోని బ్యాక్టీరియా నశిస్తుంది.