ముమ్మరంగా చెట్టుకొమ్మలు తొలిగింపు కార్యక్రమం

68చూసినవారు
పెనుగొండ, కొటాలపర్రు, మార్టేరు, వెలగలేరు, వనంపల్లి, తదితర గ్రామాలలో, శనివారం స్థానిక విద్యుత్ సిబ్బంది ఆధ్వర్యంలో చెట్టుకొమ్మలు తొలిగింపు కార్యక్రమం ముమ్మరంగా నిర్వహించారు. వర్షాకాలంలో చెట్టుకొమ్మలు కారణంగా, విద్యుత్ సరఫరా లో లోపాలు తలెత్తకుండా, ముందు జాగ్రత్తగా చెట్టుకొమ్మలు తొలిగింపు కార్యక్రమం చేపట్టినట్లు లైన్ మెన్ గణపతి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్