పెనుమంట్ర మండలం పొలమూరులో శనివారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హాజరై మాట్లాడారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అందుకోసం 2000 బస్సులను కూటమి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు.