మావుళ్ళమ్మ అమ్మవారికి 10 గ్రాముల బంగారం విరాళం

73చూసినవారు
మావుళ్ళమ్మ అమ్మవారికి 10 గ్రాముల బంగారం విరాళం
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి బుధవారం తణుకుకి చెందిన పెనుగొండ మౌర్య, సాయిశృతి దంపతులు 10 గ్రాముల బంగారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ ఉపప్రధాన అర్చకులు కొప్పేశ్వరావు పూజలు నిర్వహించి ప్రసాదం, ఫోటో, శేషవస్త్రం అందజేశారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి, నగేశ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్