ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం యువకుడి మృతి

83చూసినవారు
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం యువకుడి మృతి
ప. గో జిల్లా పాలకొల్లు పట్టణంలో శుక్రవారం విషాదం నెలకొంది. పాలకొల్లు నుంచి నరసాపురం వెళ్లే రైలు మార్గంలో ఓ ప్రేమ జంట శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో యువకుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు
నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్