పెంటపాడు మండలం పెంటపాడు గ్రామం లో శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ఏఎన్ఎం ఆశా సిబ్బంది గ్రామంలో విస్తృతంగా పర్యటించి, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఇళ్లలో పనికిరాని వస్తువులు ఉంచరాదని,ఇళ్ల వద్ద మురుగునీరు నిల్వ ఉండరాదని వీటివల్ల డెంగ్యూ, మలేరియా దోమలు వ్యాప్తి చెందుతాయని వివరించారు.