తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధించిన నేపథ్యంలో ఆచంటలో బీజేపీ కార్యకర్తలు కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఉపఎన్నికలలో బిజేపికి ఎదురులేదని మండల బిజేపి అధ్యక్షుడు నాగసుబ్బారావు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు, వెంకన్నబాబు, సిద్దయ్య, పలువురు కార్యకర్తలు పాల్గోన్నారు.