గుజరాత్‌లోని సూరత్‌లో షాకింగ్ ఘటన జరిగింది. వరచా ప్రాంతంలో ఉండే తరుణి (17) అనే యువతి సోహమ్ గోహిల్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. అయితే వారిద్దరి మధ్య పెళ్లి గురించి చిన్న వివాదం వచ్చింది. దీంతో వారిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని సిద్ధపడ్డారు. అనంతరం ఓ బిల్డింగ్ పైకి ఎక్కి కిందకు దూకే సమయంలో సోహమ్ తరుణి చేయి వదిలేసి పారిపోతాడు. ఈ ఘటనలో యువతి కిందపడి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.