ఆచంట మండలంలో అచీవర్స్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు వారికి భవిష్యత్తులో పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు అందించారు. విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని అదే అచీవర్స్ ఆర్గనైజేషన్ లక్ష్యమని సభ్యులు సుధీర్ బాబు వివరించారు. మండలంలోని ఆచంట ,కొడమంచిలి ,పెనుమంచిలి, వేమవరం గ్రామాల్లో హైస్కూల్లో ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో సభ్యులు మనోజ్ కుమార్,చంద్రశేఖర్, పవన్, వినయ్, శివ పాల్గొన్నారు.