పెనుగొండ: సిపిఎం సభ్యుడు మన్నె ప్రసాదు మృతి

50చూసినవారు
పెనుగొండ: సిపిఎం సభ్యుడు మన్నె ప్రసాదు మృతి
సిపిఎం పార్టీ సీనియర్ సభ్యులు, కౌలు రైతు గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందారు.
దేవ గ్రామానికి చెందిన మన్నె ప్రసాదు(58) పార్టీ పట్ల అంకితభావంతో ఉండేవారని, పార్టీ అంటే అచంచల విశ్వాసంతో పనిచేసే ఆయనకు సిపిఎం పెనుగొండ మండల కమిటీ జోహార్లు అర్పించింది. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి షేక్ పాదుషా ఆయన మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు.

సంబంధిత పోస్ట్