పెనుగొండ గ్రామపంచాయతీలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్ వ్యవస్థనే కొనసాగిస్తూ ఇస్తున్న అరకొర వేతనాలు నుండి మోక్షం కలిగించి కనీస వేతనం రూ 26000, అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం పెనుగొండ గ్రామపంచాయతీ కార్యనిర్వహణాధికారి రత్నాకరరావుకు కార్మికులు వినతిపత్రం సమర్పించారు.