పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెంలో రూ. 43 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గురువారం ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని రాష్ట్రాల రాజధానుల కంటే అమరావతిని అద్భుతమైన రాజధానిగా చేసేందుకు సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు.