ఆచంటలో స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగ శనివారం బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలో కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. అదేవిధంగా 2024 ఎన్నికలలో బీజేపీ, జనసేనలు ఓక శక్తిగా ఏదుగుతయని,వైసీపీ, టీడీపీలకు తగిన సమాధానం చెబుతమని జనసేన ఆచంట నియెజకవర్గ ఇన్ చార్జి చెగొండి సూర్యప్రకాష్ అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస వర్మ, పాకా సత్యనారాయణ, నాగసుబ్బారావు, మండలంలో పోటి చేస్తున్న ఇరుపార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.