భీమవరం పట్టణం లోని గునుపూడి సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయం వద్ద దిశ యాప్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగలక్ష్మి పాల్గొని మహిళలకు దిశ యాప్ పై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు దిశ యాప్ పై అవగాహన కల్పిస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా దిశ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.