రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తానన్న ఇరవై వేల రూపాయలను తక్షణమే అందించి రైతులను ఆదుకోవాలని సీపీఐ పగో జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. బుధవారం భీమవరంలోని స్థానిక జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. అధికారం చేపట్టి ఐదు నెలలు దాటిందని ఇప్పటికీ సాగు సాయం ఇవ్వక పోవడం దారుణమని విమర్శించారు.