భీమవరం పట్టణంలోని 12వ వార్డులో మంగళవారం మున్సిపల్ కమిషనర్ కే. రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డులో తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా ఇవ్వాలని స్థానికులకు సూచించారు. ఈ మేరకు వార్డు పరిధిలో అనధికార కట్టడాలను గుర్తించి నోటీసులు జారీ చేసేలాగా టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు.