తుఫానులు, వరదలతో సర్వసం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు విరివిగా విరాళాలిచ్చి సహకరించాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. సీపీఐ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం భీమవరం పట్టణంలో వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు.