దంతులూరి నారాయణరాజు కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కళాశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహ రాజు ఆవిష్కరించి యన్.సి.సి. కేడెట్ల గౌరవ వందనం స్వీకరించారు.కళాశాల పాలకవర్గ అధ్యక్షులు శ్రీ గోకరాజు వెంకట నరసింహ రాజు మాట్లాడుతూ ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని ఆదేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే జాతీయ పండుగే గణతంత్ర దినోత్సవము అని అన్నారు.