పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నూతన అధికారి గా జయసింహ నియమితులయ్యారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ జైసింహ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి ఇ పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా వైద్య ఆరోగ్య శాఖ పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.