భీమవరం డిఎన్నార్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు జయంతి వేడుకలను సోమవారం అభిమానులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎంపీ, మండలి చైర్మన్, ఎమ్మెల్యేలు పాల్గొని కేక్ కట్ చేసి మాట్లాడారు. అనంతరం కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి మాట్లాడుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే కృష్ణంరాజు గొప్పతనమని అన్నారు. అలాగే మెగా మెడికల్ క్యాంపును ఆమె ప్రారంభించారు.