చింతలపూడి మండలం పాత చింతలపూడిలో నియోజకవర్గ సంఘాలు, పాస్టర్స్ ఫెలోషిప్‌ల సహకారంతో క్రిస్మస్ నాటిక వేడుకను ఘనంగా మంగళవారం రాత్రి నిర్వహించారు. ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రీస్తు జనన నాటిక మొట్టమొదటిసారిగా భారీ సెట్టింగ్‌లతో 60మందికిపైగా ఆర్టిస్టులతో అద్భుతమైన నాటికను ప్రదర్శించినందుకు నిర్వాహకులను ప్రశంసించారు.