చింతలపూడి: అరటిలో తెగుళ్లకు చెక్‌ పెట్టండిలా!

52చూసినవారు
చింతలపూడి: అరటిలో తెగుళ్లకు చెక్‌ పెట్టండిలా!
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత వాతావరణ ఉష్ణోగ్రతల హెచ్చతగ్గులు, అధిక తేమ శాతం కారణంగా అరటిలో ఆకుమచ్చ తెగుళ్లు, దుంప కుళ్లు తెగుళ్లు ఆశిస్తున్నాయి. ఈ క్రమంలో చింతలపూడి ఉద్యాన శాఖాధికారి ఎండీ షాఫియా ఫర్హీన్‌ ఆదివారం రెతులకు పలు సూచనలు చేశారు. పనామా దుంప కుళ్లు తెగులు రహిత తోటల నుంచి మాత్రమే పిలకలు ఎంపిక చేసుకోవాలి. పిలకలను సుడోమొనస్‌ లేదా మాంకోజెబ్‌ లేదా కార్బెండిజమ్‌ ద్రావణంతో శుద్ధి చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్