చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు శనివారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా సీఐ అశోక్ మాట్లాడుతూ. ఈ దాడుల్లో నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకొని ఆమె వద్ద 20 లీటర్ల నాటు గుర్తించామన్నారు. అలాగే సుమారు 600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు. సదరు మహిళపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.