నరకప్రాయంగా రహదారి

66చూసినవారు
ఏలూరు జిల్లా చింతలపూడి నుండి టి. నరసాపురం మీదుగా జంగారెడ్డిగూడెం వెళ్లే ప్రధాన రహదారి నరకప్రాయంగా మారింది. సింగిల్ లైన్ రహదారి కావడం వల్ల ఎదురుగా భారీ వాహనం వస్తే తప్పుకునే పరిస్థితి లేదు. బుధవారం కంటైనర్ లారీ ఎదురుగా రావడంతో ఆర్టీసీ బస్సు పక్కనుంచి వెళుతున్న నేపథ్యంలో దిగబడింది. దీంతో బస్సులోని ప్రయాణికులు కిందకు దిగిపోయారు. ఈ రహదారిపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు ప్రయాణికులకు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్