ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్థానిక బోసు బొమ్మ సెంటర్లో ఏర్పాటుచేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని శనివారం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారత్ మాతాకీ జై అంటూ కూటమి నేతలు నినాదాలు చేశారు.