జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎమ్మెల్యేసొంగా రోషన్ కుమార్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 35 ఎమ్మార్పీ ఉన్న ఫ్రూటీ బాటిల్ రూ. 40కు విక్రయిస్తున్నారని తెలిసి సదరు దుకాణాదారులతో మాట్లాడారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.